బందర్ పోర్ట్ వరకు రైల్వే లైన్ అనుమతి ఇవ్వాలి..! 1 d ago
TG: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైల్వే టర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బందర్ పోర్ట్ వరకు రైల్వే లైన్ అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా, కర్ణాటక కు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుందని రేవంత్ చెప్పారు.